804 క్యాప్ ధరించినందుకు పాకిస్తాన్ క్రికెటర్కు రూ. 4లక్షల జరిమానా!

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు గానూ క్రికెటర్ అమీర్ జమాల్ కు బోర్డు రూ.4లక్షల జరిమానా విధించింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖైదీ నంబర్ కూడా 804 కావడంతో అతనికి మద్దతు ప్రకటించిన బోర్డు ఈ జరిమానా విధించింది.

New Update
804

మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చినందుకు గానూ పాకిస్థాన్ క్రికెటర్ అమీర్ జమాల్ కు బోర్డు భారీ జరిమానా విధించింది.  వాస్తవానికి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అమీర్ జమాల్ సహా పలువురు క్రికెటర్లపై కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూ.5 లక్షల జరిమానా విధించింది.  28 ఏళ్ల అమీర్ జమాల్ గత ఏడాది అక్టోబర్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ సందర్భంగా "804" అనే నంబర్ రాసిన టోపీని ధరించాడు. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం జమాల్ ధరించిన టోపీపై ఉన్న '804' నంబర్ ఇమ్రాన్ ఖాన్ జైలు ఖైదీ నంబర్ తో ముడిపడి ఉంది. 2023 నుండి కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌కు 2025 జనవరిలో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అనేక అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం రావల్పిండి జైలులో ఉన్నారు. జైలులో ఇమ్రాన్ ఖైదీ నంబర్ కూడా '804'. 

ముగ్గురు పాక్ ఆటగాళ్లకు కూడా

ముల్తాన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆన్-ఫీల్డ్ ఇంటర్వ్యూ సందర్భంగా 28 ఏళ్ల జమాల్ ఈ నంబర్ టోపీని ధరించి ఇమ్రాన్ కు పరోక్షంగా మద్దతు ప్రకటించాడు. అయితే దీనిని ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లుగా భావించిన బోర్డు రూ. 4లక్షల జరిమానా విధించింది.  ఆమిర్ తో పాటు మరో ముగ్గురు  పాక్ ఆటగాళ్లకు కూడా రూ.5లక్షల జరిమానా విధించింది బోర్డు.  2024 నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ముగ్గురూ జట్టు హోటల్‌కు ఆలస్యంగా చేరుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా, సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, అబ్బాస్ అఫ్రిదిలకు బోర్డు జరిమానా విధించింది. పాకిస్తాన్ ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది,  ఇక్కడ పాక్ ఐదు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.  ఆదివారం క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో ముందంజలో ఉంది.  

Also Read :  ఆమె ప్రతి అంగంలో బంగారమే.. రన్యారావుపై బీజేపీ MLA వల్గర్ కామెంట్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు