Cricket: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా?
ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న అమిత్ షా కుమారుడు జై షా ఐసీసీ ఛైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక ఈ ఏడాది నవంబర్ లో జరగనుంది. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే ఉన్నారు. ఇతను నాలుగు ఏళ్ళుగా ఇందులో కొనసాగుతున్నారు.