ICC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జైషా..

ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు చేపట్టారు. భారత్‌ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా కావడం విశేషం. జైషా ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ పదవిలో భారత్‌ నుంచి చివరిగా శశాంక్‌ మనోహర్‌ 2015 నుంచి 2020 మధ్య ఉన్నారు.

New Update
Jay Shah

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు చేపట్టారు. భారత్‌ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తి జైషా. మరో విషయం ఏంటంటే.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జైషా (35) గుర్తింపు దక్కించుకున్నారు. ఇకపోతే జైషా ఈ పదవిలో దాదాపు రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

ఈ పదవిలో భారత్‌ నుంచి చివరిగా శశాంక్‌ మనోహర్‌ 2015 నుంచి 2020 మధ్య కొనసాగారు. ఇక జైషా కంటే ముందు దివంగత జగ్‌మోహన్ దాల్మియా, రాజకీయ నేత శరద్ పవార్, న్యాయవాది శశాంక్ మనోహర్, పారిశ్రామికవేత్త ఎన్ శ్రీనివాసన్.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చూడండి: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

జైషా ఆసక్తికర వ్యాఖ్యలు

ICC చైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ICC ఛైర్‌గా పదవి బాధ్యతలు ప్రారంభిస్తున్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నాను అని తెలిపారు. అలాగే ఈ ముఖ్యమైన పాత్రను చేపట్టడానికి తనపై ICC డైరెక్టర్లు, బోర్డు సభ్యులు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇది కూడా చూడండి: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

దీంతో 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆటను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానని తన ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..? 

అలాగే తాము LA28 ఒలింపిక్ క్రీడలను నిర్మించడం జరుగుతుందని.. ఈ క్రికెట్‌ను మునుపెన్నడూ లేనంతగా.. జనాదరణ పొందేందుకు కృషి చేస్తున్నామని.. ఇది క్రికెట్‌కు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని తెలిపారు. 

జైషా కెరీర్

జై షా ప్రయాణం 2009 నుండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్, అహ్మదాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యునిగా పనిచేశారు. ఆ తర్వాత షా సెప్టెంబర్ 2013 లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA ) జాయింట్ సెక్రటరీ అయ్యాడు. 

అనంతరం జైషా 2015లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీలలో సభ్యుడు అయ్యాడు. అతను సెప్టెంబర్ 2019లో GCA జాయింట్ సెక్రటరీ పదవి నుండి వైదొలిగాడు. ఆ తరువాతి నెలలో అతను ఐదుగురు ఆఫీస్ బేరర్లలో అతి పిన్న వయస్కుడైన బిసిసిఐ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మీడియా హక్కుల ఒప్పందాన్ని BCCI రికార్డ్ బద్దలు కొట్టడానికి జే షా నాయకత్వం వహించాడు.

. . . . 

Advertisment
Advertisment
తాజా కథనాలు