Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. హైబ్రిడ్ మోడల్‌లోనే మెగా టోర్నీ నిర్వహించబోతున్నట్లు ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లట్లేదని, 2024-27 భారత్, పాక్ ఐసీసీ ఈవెంట్లన్నీ హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది.
JUST IN: ICC issues update on Champions Trophy 2025 venue.
— ICC (@ICC) December 19, 2024
Details 👇https://t.co/aWEFiF5qeS
పాక్ లోనే 2028 వరల్డ్ కప్..
పీసీబీ, బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ నిర్ణయం వెల్లడించినట్లు తెలిపింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భాతర్ తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడునున్నట్లు తెలిపింది. ఇండియా వేదికగా జరిగే 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌తోపాటు 2026 టీ20 ప్రపంచ కప్ హైబ్రిడ్ విధానంలోనే నిర్వహించబోతున్నట్లు అనౌన్స్ చేసింది. 2026 టీ20 వరల్డ్ కప్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనుండగా.. పాక్ మ్యాచ్‌లు భారత్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. ఇక 2028 మహిళల టీ20 వరల్డ్ కప్ పాక్ అథిత్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది.