ICC: భారత్ లేకుండానే ఛాంపియన్ ట్రోఫీ.. MEA అధికారిక ప్రకటన

ICC ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని MEA అధికారికంగా ప్రకటించింది. అక్కడ భద్రతా సమస్యల రీత్యా బీసీసీఐ నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు ఎంఇఎ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు.

New Update
Pakistan For ICC Champions Trophy

పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో నిర్వహించనున్నారు. దీనిపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. ఇందుకోసం దాదాపు వంద రోజుల ముందే షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. కానీ గడువు ముగిసినా ఇప్పటికీ షెడ్యూల్‌ విడుదల కాలేదు. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు తాము పాకిస్థాన్‌ వెళ్లబోమని, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాలని భారత్‌ చెప్పంది. దానికి ఆతిథ్య దేశం ఒప్పుకోకపోవడంతో టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. 

Also Read :  హైదరాబాద్ లో అరబ్ షేక్ అరాచకం.. 12 ఏళ్ల బాలికలతో కాంట్రాక్ట్ మ్యారేజ్‌

టీమిండియా పాకిస్తాన్ వెల్లదు

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్‌ను సందర్శించే అవకాశం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఇవాళ (శుక్రవారం) వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌ను సందర్శించడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) గతంలో తెలియజేసిన తర్వాత ఈ రోజు కీలకమైన ఐసిసి సమావేశానికి ముందు MEA ఈ విషయాన్ని తెలిపింది. 

Also Read :  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి

Also Read :  జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్!

దీని గురించి MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘భారత క్రికెట్ జట్టు.. బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్కడ భద్రతా సమస్యలు ఉన్నాయని వారు చెప్పారు. టీమ్ అక్కడికి వెళ్లే అవకాశం లేదు’’ అని తెలిపారు. 

Also Read :  బ్లాక్ బాడీకాన్ అవుట్ ఫిట్ లో..చేతిలో అది పట్టుకొని తమన్నా హాట్ ఫోజులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు