ICC AWARDS 2024: టెస్టుల్లో ఈ ఇద్దరికే.. వన్డేల్లో ఒక్కరు లేరు!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది పురుషులు, మహిళా ప్లేయర్ల లిస్ట్‌ రిలీజ్ చేసింది. జైస్వాల్, జడేజా, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు.

New Update
icc 2024

ICC AWARDS 2024 men and women cricketers list

ICC AWARDS 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 అవార్డ్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. ఈ ఏడాది టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 11మంది ఇంటర్నేషనల్ ప్లేయర్ల లిస్ట్‌తో పాటు icc ఎంపిక చేసిన జట్టుకు కెప్టెన్‌ను నియమించింది. 

ఈ మేరకు ఐసీసీ ఓటింగ్ అకాడమీ - గణాంకాలు, ఈ క్యాలెండర్ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సాధించిన సగటు, విజయాల ఆధారంగా పురుషులు, మహిళ ఆటగాళ్లను ఎంపిక చేశారు. 

ICC పురుషుల టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్:

1. యశస్వి జైస్వాల్ (ఇండియా)
2. రవీంద్ర జడేజా (ఇండియా)
3. ప్యాట్ కమిన్స్ (కెప్టెన్, ఆస్ట్రేలియా)

ICC మహిళల ODI టీమ్ ఆఫ్ ద ఇయర్:
1. స్మృతి మంధాన (ఇండియా)
2. దీప్తి శర్మ (ఇండియా)
3. లారా (కెప్టెన్, సౌతాఫ్రికా)

పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్:
1. చరిత్ అసలంక కెప్టెన్ (కెప్టెన్, శ్రీలంక)

ICC ఓటింగ్ అకాడమీ
జహీర్ ఆడమ్స్, షోయబ్ అహ్మద్, ఆండ్రూ ఆల్డర్సన్, అథర్ అలీ ఖాన్, ఎలిజబెత్ అమ్మోన్, రస్సెల్ ఆర్నాల్డ్, డాన్ బెస్విక్, ఇయాన్ బిషప్, రెక్స్ క్లెమెంటైన్, రోరీ డాలర్డ్, మెల్ ఫారెల్, డారెన్ గంగా, నటాలీ జర్మనోస్, ఎస్ గోమేష్, విక్రాంత్ గుప్తా, షాహల్‌హర్ష్మీ హాతీ, నాసర్ హుస్సేన్, మహ్మద్ ఇసామ్, ఐసోబెల్ జాయిస్, ఫైసల్ కమల్, స్టేసీ ఆన్ కింగ్, ఫైసన్ లఖానీ, ఆండ్రూ లియోనార్డ్, కేటీ మార్టిన్, మ్పుమెలెలో మ్బాంగ్వా, ఫిర్దోస్ మూండా, మసూద్ పర్వేజ్, ఎమల్ పసర్లీ, జూలియా ప్రైస్, పాల్ రాడ్లీ, మెహ్లులి సిబాండా, గెర్ సిగ్గిన్స్, భరత్ సుందరేలేసన్ ఉన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు