High Court: జనవరి 9 వరకు హరీశ్ ను అరెస్టు చేయొద్దు-హైకోర్ట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును జనవరి 9 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అంతకు ముందు డిసెంబర్ 30 వరకు హరీశ్ రావును అరెస్టు చేయొద్దని ఇచ్చిన ఆదేశాలను నిన్న పొడిగించింది.
Hyderabad: బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్‌లో అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాలాపూర్‌లోని ప్లాస్టిక్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వచ్చాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
HYD: న్యూఇయర్ కు ముందే పెద్ద పబ్‌లో డ్రగ్స్ పట్టివేత
న్యూ ఇయర్ సదర్భంగా హైదరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజలుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈరోజు కొండాపూర్ మస్జీద్ బండ లోని మాయ కన్వెన్షన్ పక్కన ఉన్న క్వాక్ అరేనా పబ్ లో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు.
Manmohan Singh కు భారత రత్న ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన విశిష్ట సేవలు గురించి సభలో సీఎం ప్రస్తావించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ తెలిపారు.
Telangana: లడ్డూ ప్రసాదం.. ఆలయ ఈవోలకు దేవాదాయశాఖ కీలక ఆదేశాలు
తెలంగాణ దేవాదాయ శాఖ ఈవోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యిని యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసి జనవరి 1వ తేదీ నుంచి ఉపయోగించాలని తెలిపింది.
Numaish: నుమాయిష్ ఎగ్జిబిషన్ వాయిదా.. ఎందుకంటే ?
వచ్చే ఏడాది నిర్వహించనున్న 84వ నుమాయిష్ కార్యక్రమం జనవరి 3కి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిషన్ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు.
TG News: సాగరతీరాన సెయిలింగ్ ఛాంపియన్షిప్
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో తెలంగాణ రాష్ట్రం సెయిలింగ్ ఛాంపియన్షిప్ కొనసాగుతున్నాయి . ఈ పోటీల్లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. రెండోరోజు పోటీల్లో టాప్‌సీడ్ సెయిలర్లు గోవర్ధన్, శ్రవణ్ సత్తా చాటుతున్నారు.
/rtv/media/media_files/2025/01/01/IqFQ8J6kecj4SqZreHo1.jpg)
/rtv/media/media_files/2024/11/16/Nysplz6fONocizoblim2.jpeg)
/rtv/media/media_files/2024/12/28/N5JNwOMvCzUnaX9k8vq6.jpg)
/rtv/media/media_files/2024/12/30/PKZJNB2PiiJE8212bxKV.jpg)
/rtv/media/media_files/2024/12/30/tzHaJRIoCycG5bPGPqiJ.jpg)
/rtv/media/media_files/vL1Z91Xex8bziRVjCJ05.jpg)
/rtv/media/media_files/2024/12/29/ZBR5tjApHeZRd7mDylUb.jpg)
/rtv/media/media_files/2024/12/28/5I6bHKYhhakx4LIi7uTE.jpg)