/rtv/media/media_files/2025/01/15/hajQDvoL6ZqYZqgmWVYy.jpg)
China Manja
Chinese Manja: సంక్రాంతి పండుగ వేళ చైనా మాంజాల వల్ల ప్రాణాల మీదకు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఓ కానిస్టేబుల్ మెడకు మాంజా తాకి చర్మం కోసుకుపోవడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాజ్ అనే వ్యక్తి లంగర్‌హౌస్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఆయన నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్‌నగర్ రోడ్డుకు ఇంటికి వెళ్తున్నారు. అలా వెళ్తుండగా చైనా మాంజా అతని మెడకు తగిలింది. దీంతో చర్మం కోసుకుపోయి తీవ్రంగా రక్తస్రావమైంది.
Also Read: ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసమా ? సైకిల్ ట్రాక్‌ల కోసమా ?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
చివరికీ శివరాజ్‌ను స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదిలాఉండగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో మరొకటి చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చైనా మాంజా తగిలి గాయాపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడకు సాయివర్థన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గ్లోబల్‌శ్రీవెన్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే బుధవారం ఉప్పల్‌లో బైక్‌పై వెళ్తుండగా అతని మెడకు మాంజా తగిలింది. దీంతో సాయివర్థన్ రోడ్డుపై పడిపోయాడు.
అతని మెడకు గాయం కాగా.. అక్కడున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం గాలిపటాలు ఎగరవేసేందుకు చైనా మంజాను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలామంది దీనిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇప్పటికీ చైనా మాంజాలనే వాడుతున్నారు. పలువురు వ్యాపారులు సైతం లాభం కోసం అక్రమంగా చైనా మాంజాలను అమ్ముతున్నారు.
Also Read: 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి
భారీగా చైనా మంజాలు - Chinese Manja
ప్రతీ సంవత్సరం చైనా మాంజా వల్ల రోడ్డుపై వెళ్లే వాహనాదారులు ప్రమాదాలు గురవుతున్నారు. ఈ దారం కోసుకొని మరికొందరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం సోదాలు జరపగా.. భారీగా చైనా మంజాలు పట్టుబడ్డాయి. మరోవైపు ఈ మాంజాలు వాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది వినడం లేదు. ఇకనుంచైనా గాలిపటాలు ఎగురవేసేందుకు వీటిని వాడకుండా నార్మల్ దారాలను వాడాలని పలువురు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.
Also Read : సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!
Aslo Read : Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్.. మద్యం ధరలు తగ్గాయోచ్!