అదిరింది కదూ .. ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో విందు

సంక్రాంతి పండగకు హైదరాబాద్కు వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో 130 రకాల వంటకాలతో ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అత్తింటివారు. వంటల లిస్ట్‌లో పిండివంటలు, నాన్ వెజ్,  వెజ్ , స్వీట్స్ ,పండ్లు, పులిహోర, బాగారా రైస్‌ లతో పాటుగా విభిన్న రకాలున్నాయి. 

New Update
alludu

alludu Photograph: (alludu)

సంక్రాంతి పండగకు హైదరాబాద్కు వచ్చిన ఓ ఆంధ్రా అల్లుడికి తెలంగాణ స్టైల్లో 130 రకాల వంటకాలతో ఊహించని సర్‌ప్రైజ్‌  ఇచ్చారు అత్తింటివారు. పెళ్లాయ్యక అల్లుడు తొలిసారి ఇంటికి రావడంతో వివిధ రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్‌ శారదా నగర్‌ కు చెందిన  ఖమ్మంపాటి క్రాంతి, కల్పన దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. వీరి పెద్దకూతురి వివాహం ఇటీవల కాకినాడకు చెందిన మల్లిఖార్జున్‌తో జరిపించారు.  

పెళ్లాయ్యాక ఇంటికి వచ్చిన అల్లుడికోసం  అత్తింటివారు వెజ్, నాన్ వెజ్ తో కూడిన 130 రకాల వంటకాలు చేసి వడ్డించారు.  అత్తింటివారు ఇచ్చిన సంక్రాంతి సర్‌ప్రైజ్‌ కు మల్లిఖార్జున్‌ అనందం వ్యక్తం చేశాడు. వంటల లిస్ట్‌లో సంక్రాంతి  పిండివంటలు, నాన్ వెజ్,  వెజ్ , స్వీట్స్ ,పండ్లు, పులిహోర, బాగారా రైస్‌ లతో పాటుగా విభిన్న రకాలున్నాయి. 

వాస్తవానికి సంక్రాంతి పండగంటే ఆంధ్రప్రదేశ్‌లో బాగా చేసుకుంటారు. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలో  పండగ వాతావరణం వేరే లెవల్ లో ఉంటుంది.  అక్కడ ఇంటి అల్లుడికి ఇలాంటి మర్యాదలు చేయడం సహజంగానే ఉంటాయి. కానీ తెలంగాణలో కూడా ఇలా చేయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆ అల్లుడు లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

భోగి వేడుకలు వైభవంగా

తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలో మొదటిరోజైన భోగి రోజున  తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేసి ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. . భోగి మంటలు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.  తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తు్న్నారు.  మరోవైపు  నగరవాసులంతా పల్లెలకు వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి.  

భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజున విష్ణువు వామనావతరంలో బలిని పాతాళానికి అణచివేశాడు. గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలకులను రక్షించారని చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పురాణ గాథ.

Also Read :  పది రూపాయల కోసం లొల్లి.. మాటమాట పెరిగి తన్నుకున్నారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు