/rtv/media/media_files/2025/01/15/eLoG7YbHUdu5WfFSzt5p.jpg)
Chinese Manja
సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నాపెద్దా అందరూ కలిసి గాలిపటాలు ఎగరవేస్తున్నారు. అయితే చైనా మంజాల వల్ల పలువురు గాయాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చైనా మాంజా తగిలి గాయాపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడకు సాయివర్థన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గ్లోబల్‌శ్రీవెన్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే బుధవారం ఉప్పల్‌లో బైక్‌పై వెళ్తుండగా అతని మెడకు మాంజా తగిలింది. దీంతో సాయివర్థన్ రోడ్డుపై పడిపోయాడు.
Also Read: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా!
అతని మెడకు గాయం కాగా.. అక్కడున్న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ప్రభుత్వం గాలిపటాలు ఎగరవేసేందుకు చైనా మంజాను నిషేధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలామంది దీనిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇప్పటికీ చైనా మాంజాలనే వాడుతున్నారు. పలువురు వ్యాపారులు సైతం లాభం కోసం అక్రమంగా చైనా మాంజాలను అమ్ముతున్నారు.
Also Read: జనవరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం.. !
ప్రతీ సంవత్సరం చైనా మాంజా వల్ల రోడ్డుపై వెళ్లే వాహనాదారులు ప్రమాదాలు గురవుతున్నారు. ఈ దారం కోసుకొని మరికొందరు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు మంగళవారం సోదాలు జరపగా.. భారీగా చైనా మంజాలు పట్టుబడ్డాయి. మరోవైపు ఈ మాంజాలు వాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలామంది వినడం లేదు. ఇకనుంచైనా గాలిపటాలు ఎగురవేసేందుకు వీటిని వాడకుండా నార్మల్ దారాలను వాడాలని పలువురు నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.
Also Read: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా
Also Read: టిబెట్‌లో ఆగని భూ ప్రకంపనలు..168 గంటల్లో 3600 సార్లు..