HYD Fire Accident: హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన యువకుడు!
జగద్గిరిగుట్ట రింగ్బస్తీలోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి (27) అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. మొబైల్ పేలి షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.