/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
లవ్ ఫెయిల్యూర్ కావడంతో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన వాసి సాగర్ మియాపూర్‌లోని డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే యజమాని పరమేశ్ స్టూడియోకు వెళ్లి చూడగా అక్కడే ఉరేసుకుని సాగర్ మృతి చెందాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అయితే గతంలో ఓ అమ్మాయిని ప్రేమించాడని విఫలమైన బాధలో చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Vijay Devarakonda : అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఓ విద్యార్థిని కూడా..
ఇదిలా ఉండగా ఇటీవల ఓ విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకుంది. పోటీపరీక్షలు అనగానే భయామో, లేక విజయం సాధించలేమన్న అపనమ్మకమో కానీ పోటీ పరీక్షల కోచింగ్‌కు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గడచిన ఏడాది కాలంగా ఇక్కడ ఆత్మహత్యలు కొనసాగుతుండగా 2025లో ఆత్మహత్య చేసుకున్నవారి సంఖ్య 15కు చేరింది. తాజాగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య కావడం గమనార్హం.
ఇది కూడా చూడండి: iQOO Neo 10: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
జమ్మూకశ్మీర్ కు చెందిన 18 ఏళ్ల విద్యార్థిని జీషాన్ నెలరోజుల క్రితమే నీట్ కోచింగ్ కోసం కోటాకు వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రతాప్ చౌరాహా ప్రాంతంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ నీట్‌కు సన్నద్ధమవుతోంది. రోజులాగే ఆదివారం సాయంత్రం తన కుటుంబ సభ్యులతో మాట్లాడిన జీషాన్ ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో విద్యార్థిని స్నేహితురాలికి కాల్ చేశారు.
ఇది కూడా చూడండి: Lalu Prasad Yadav: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
వెంటనే ఆమె జీషాన్ గది వద్దకు వెళ్లింది. లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో ఆమె చాలాసేపు పిలిచింది. అయినా పలకకపోవడంతో ఇతరుల సాయంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే జీషాన్ ఉరివేసుకుని కనిపించడంతో ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. కాగా ఆమెను పరీక్షించిన వైద్యలు ఆమె అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
ఇది కూడా చూడండి: Maoist Funeral: మావోయిస్టుల అంత్యక్రియలు పూర్తి.. అక్కడే దహనం చేసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు!
miyapur | hyd | Dance Master