HYD Rain: దంచికొడుతున్న వాన.. ఆ ఏరియాల్లో స్తంభించిన ట్రాఫిక్.. చెరువులను తలపిస్తున్న రోడ్లు!

హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడిక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యంగా గచ్చిబౌలి, ఐటీ హబ్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

New Update
rains

rains

గత మూడు రోజుల నుంచి సూర్యుడు ప్రజలకు కాస్త ఉపశమనాన్ని ఇవ్వగా నేడు వరుణ దేవుడు భీభత్సమైన వర్షం కురిపించాడు. తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. 3 గంటల తర్వాత మేఘం మారి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. కేవలం గంట పాటు కురిసిన వర్షానికి రోడ్లు అన్ని కూడా జలమయ్యం అయ్యాయి. నదులను తలపించేలా లోతట్టు ప్రాంతాలు మారాయి. క్యూమిలోనింబస్ కారణంగా తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

ఇది కూడా చూడండి:Weather Update: మరో 6 రోజులు కుమ్ముడే కుమ్ముడు.. భారీ వర్షం, తుఫాను గాలుల హెచ్చరిక!

ఈ ఏరియాల్లో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు..

మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకే ఏరియా అనే కాకుండా హైదరాబాద్ అంతటా వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, మూసాపేట్, బోరుబండ, యూసఫ్‌గూడ, సనత్ నగర్, అబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణ గూడ, సికింద్రాబాద్, పఠాన్ చెరువు, కూకట్‌పల్లి, షేక్‌పేట్, దుర్గం చెరువు, మణికొండ, దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. 

ఇది కూడా చూడండి:Weather Update: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు!

ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..

సాధారణంగానే హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాంటిది వర్షాల సమయంలో అయితే చెప్పక్కర్లేదు. రోడ్లు నదులుగా మారడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ హబ్ శిల్పారామం, అమీర్‌పేట, కూకట్‌పల్లి వంటి జంక్షన్లలో అయితే భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు, స్కూళ్ల నుంచి విద్యార్థులు వెళ్లే సమయం. నేడు సోమవారం ఐటీ ఉద్యోగస్తులు తప్పకుండా ఆఫీసులకు వెళ్తుంటారు. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు