/rtv/media/media_files/2025/04/26/KRrgEmVghNYsakwYHLWC.jpg)
HYD Fire Accident
FIRE ACCIDENT
హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త చుట్టు పక్కల వ్యాపించడంతో దాదాపు 300 గుడిసెలు దగ్ధం అయ్యాయి. మరోవైపు కాలిపోతున్న గుడెసెల్లో ఉన్న సిలిండర్లు పేలిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఉంది.
Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!
హయత్నగర్లో భారీ అగ్ని ప్రమాదం
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025
హైదరాబాద్ - హయత్నగర్ కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్లో ఉన్న ఓ గుడిసెలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మంటలు చుట్టుపక్కలకు వ్యాపించి 30 గుడిసెలు దగ్ధం
సిలిండర్లు పేలిపోతుండటంతో భయాందోళనలో స్థానికులు pic.twitter.com/NPDY7hkBZo
Also Read : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
ఏపీలో బస్సు బోల్తా
ఇదిలా ఉంటే ఇవాళ ఏపీలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలంలోని శాంతినగర్ వద్ద ఉదయం హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒక మహిళ బస్సులోనే ఇరుక్కుపోయింది.
Also Read : ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటలుగా ఆ మహిళను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. బస్సు పూర్తిగా బోల్తా పడటంతో లోపల చిక్కుకున్న మహిళను రక్షించడం కష్టం అయినప్పటికీ.. సహాయక బృందాలు నిపుణుల సహాయంతో ఆమెను బయటకు తీశారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!
telugu-news | fire accident | latest-telugu-news | hyd | HYD Crime