కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. ఎంటరైన ఈడీ.. ఏసీబీకి కీలక లేఖ!

కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది.

New Update
KTR3

కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కూడా ఈడీ కోరినట్లు తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ఈడీ అడిగినట్లు తెలుస్తోంది. ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది.

Also Read: కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. రంగంలోకి స్పెషల్ టీమ్!

కేసు నమోదు చేయనున్న ఈడీ..

భారీగా నగదు బదిలీకి సంబంధించిన వ్యవహారం కావడంతో ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఫార్ములా-ఈ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ తర్వాత ఆ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరో వైపు ఫార్ములా-ఈ వ్యవహారంపై చర్చ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళన పట్టుబడుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు