Raj Thackeray : మహారాష్ట్రను తాకిన హిందీ సెగ..మేం హిందూవులం హిందీ కాదన్న ఠాక్రే
దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు మహారాష్ట్రను కూడా తాకింది. ఈ అంశంపై ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు
Stalin Vs Yogi: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
త్రి భాష సూత్రంపై సీఎం స్టాలిన్, యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్ బ్లాక్ కామెడీలా ఉందంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.
Pawankalyan: హిందీపై పవన్ మళ్లీ సంచలన కామెంట్స్.. తనకు లబ్ది చేకూరిందంటూ!
ఏ భాషనైనా బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. త్రిభాషా విధానంలో హిందీని మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతి భాషకూ గౌరవం ఇవ్వాలని, భాషా సంస్కృతులను గౌరవించడం తన ఏడు మార్గదర్శకాల్లో ఒకటన్నారు.
Pawan kalyan: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!
హిందీ భాషను తాను ఏ రోజు వ్యతిరేకించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నిర్భందంగా అమలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానంటూ వివరంగా పోస్ట్ పెట్టారు. కొంతమంది కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
DMK Vs BJP: ముదురుతున్న భాషా వివాదం.. రంగంలోకి సుందర్ పిచాయ్!
హిందీ భాషపై డీఎంకే, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. తమిళనాడులో హిందీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎలా చేస్తారో చూస్తామంటూ సీఎం స్టాలిన్ సవాల్ విసురుతున్నారు. దీంతో హిందీ ఎందుకు కావాలో తెలుపే సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియోను అన్నామలై పోస్ట్ చేశారు.
Nara Lokesh: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదని పేర్కొన్నారు.
Tamil Nadu: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం
నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, మరో భాషా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్టాలన్ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Tamil Nadu: తమిళనాడులో హిందీ భాష వివాదం.. బోర్డులపై నల్ల రంగు పూస్తున్న డీఎంకే కార్యకర్తలు
తమిళనాడులో డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం దుమారం రేపుంతోంది. దీనిపై స్పందించిన బీజేపీ చీఫ్ అన్నమలై డీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.