Nara Lokesh: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదని పేర్కొన్నారు.

New Update

జాతీయ విద్యావిధానం (NEP) ఇప్పుడు దేశవ్యా్ప్తంగా చర్చనీయాంశమవుతోంది. త్రిభాషా విధానంతో హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. హిందీ భాషా వల్ల 25 స్థానిక భాషలు కనుమరుగయ్యాయని అందుకే తాము ఎన్‌ఈపీని వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు. అయితే ఏపీ ఐటీశాఖ మంత్రి తాజాగా దీనిపై స్పందించారు. ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు.  

Also Read: కోమా నుంచి లేచొచ్చి పేషెంట్ హల్ చల్.. డాక్టర్లకు చుక్కలు చూపించాడు!

'' త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదు. నర్సులు, హోంకేర్‌ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి భారతీయులు ఆ భాషలను కూడా నేర్చుకోవాలి. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం ముఖ్యమని'' లోకేశ్ అన్నారు.  

Also Read: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ

అలాగే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై కూడా లోకేశ్‌ స్పందించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలపై విభజన ప్రభావం ఉంటందనే అంశాన్ని ఏకీభవిస్తానని తెలిపారు. ఎన్డీయేకి మా సపోర్ట్‌ ఉంటుందని.. ఏదైనా సమస్య వస్తే మాట్లాడి పరిష్కరించుకుంటామని అన్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు దీన్ని తమ ఎన్నికల అజెండాకు వాడుకుంటున్నాయని విమర్శలు చేశారు.  

Advertisment
తాజా కథనాలు