Latest News In Telugu Heavy Rains: ఉత్తర భారత్లో దంచికొడుతున్న వర్షాలు.. అవస్థలు పడుతున్న ప్రజలు గత మూడురోజులుగా ఢిల్లీ, ఉత్తరాఖండ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీలో ఇళ్లల్లోకి వరద చేరుతోంది.రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడా స్తంభించిపోయింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy rains: భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న 50 మంది యాత్రికులు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మార్కండ నదిపై తాత్కాలిక చెక్క వంతెన కొట్టుకుపోయింది. దీంతో గురువారం యాత్రను నిలిపివేయగా.. దాదాపు 50 మంది యాత్రికులు 11,473 అడుగుల ఎత్తులో ఉన్న మద్మహేశ్వర ఆలయం సమీపంలో చిక్కుకుపోయారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ethiopia: మట్టిచరియలు విరిగిపడిన ఘటన.. 257 మంది మృతి ఇథియోపియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడి ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 257కి చేరింది. ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. మృతుల సంఖ్య 500 వరకు పెరగొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mumbai Rains: ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి! వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Alert: దంచి కొడుతున్న వర్షాలు.. మరో ఐదు రోజులు ఇంతే! ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్! దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుకుగా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణశాఖ మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. మరో ఏడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. By Bhavana 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. పోలవరంకు భారీగా వరద ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn