హైదరాబాద్లో కుండపోత వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నిజాంపేట, మాదాపూర్, జూబ్లిహిల్స్, మణికొండ, నార్సింగి, ఖైరతాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.