Rain Alert : బిగ్ అలర్ట్.. వారం రోజులు వానలే వానలు

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వర్ష ప్రమాదం పొంచి ఉందని తెలిపింది వాతావరణశాఖ. నైరుతి బంగాళాఖాతంలోని దాని అనుకొని ఉన్న తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం ఇలా అనేక ట్రఫ్ లైన్స్ వలన ఏపీలో రానున్న వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Rains

Rain for a week

Rain Alert : ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలకు చల్లటి తీపి కబురు. వేసవి రావడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి తీపి కబురు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం భానుడు భగభగమంటుంటే సాయంత్రం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. ఈ వేసవిలో ఇటువంటి అకాల వర్షాలు సర్వసాధారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి బంగాళాఖాతంలోని దాని అనుకొని ఉన్న తమిళనాడులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం ఇలా అనేక ట్రఫ్ లైన్స్ వలన ఏపీలో రానున్న వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.


 Also Read: మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?

ఇటువంటి పరిస్థితుల వలన ఏప్రిల్ 17 తేదీన ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి, మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 17 తేదీ తర్వాత మరో 5 రోజులు పాటు ఒకటి, రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మొదటి మూడు రోజులు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయని తెలిపారు.

Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!


 సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మిగతా మూడు రోజులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తాయని తెలిపారు. మొదటి రెండు రోజులు వడగళ్ళు వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలిపారు. సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.


Also Read: టైమ్స్ ప్రభావశీలుర జాబితాలో ట్రంప్,యూనస్‌...భారతీయులకు దక్కని ప్లేస్‌!

ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారం రోజుల తర్వాత తాజా వాతావరణ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు. జీడి, మామిడి రైతులు సురక్షితంగా పంటను కాపాడుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధిత ఉత్తర్వులు పంపించామని తెలిపారు. అకాల వర్షాలకు కొంతమేర పంట నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈదురు గాలిలో 40 నుండి 50 km వేగంతో వేయడంతో పంట నష్టం జరుగుతుందని అన్నారు.

Also Read: మందుబాబులకు షాకింగ్​ న్యూస్​​.. పెరగనున్న ధరలు.. ఎంతంటే!?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు