/rtv/media/media_files/2025/08/04/madhya-pradesh-rains-2025-08-04-15-34-57.jpg)
Low Pressure
Low Pressure: గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా (Low Pressure) మారింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఆ తర్వాత అల్పపీడనం ఆ తర్వాతి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు ఈ మూడు రోజులు సముద్రంలో వేటకు వెళ్లరాదని, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Also Read : బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!కాగా రానున్న మూడు రోజుల పాటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, కాకినాడ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Also Read : బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!
ఢిల్లీలో భారీ వర్షాలు
మరోవైపు భారీ వర్షాలు ఉత్తరాదిని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో యమునానది ఉప్పొంగి ప్రవాహిస్తున్నది. ఢిల్లీలో యమునా నది డేంజర్ మార్క్ దాటింది.తీరప్రాంత ఇళ్లల్లోకి భారీగా చేరిన వరద నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు తరలిస్తున్నారు. హర్యనాలోనూ యమూనా నది తీవ్ర ప్రభావం చూపుతోంది. హత్నికుండ్ బ్యారేజీ నీటమట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!