Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో
HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు
HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు
ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. అయితే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, మద్యపానం వంటి అనేక విషయాలు దీనికి కారణం. ప్రతి రోజు శారీరక శ్రమ, హెల్తీ డైట్ తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
TG: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐదేళ్ల చిన్నారి గుండెపోటు మరణించడం స్థానికంగా కలచివేసింది. రాజు-జమున దంపతుల కూతురు ఉక్కులు నిన్న ఉదయం కళ్ళుతిరుగుతున్నాయని చెప్పడంతో ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో గుండెపోటుతో ఆమె చనిపోయింది.
గుండెపోటు వస్తే జీవనశైలితోపాటు ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఇంతకుముందు గుండెకు చికిత్స పొందినట్లయితే.. ఆవకాడో, ఆలివ్ ఆయిల్, బాదం ఎక్కవగా తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుండెపోటు ఏ వయసు వారికైనా రావచ్చు. శరీరంలోని అలసట, ఊపిరి ఆడకపోవడం, అసౌకర్యం, వికారం, మైకం, విపరీతమైన చెమట, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాఫీని రెగ్యులర్గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చట. రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని.. కాఫీ హృదయనాళాల ఫెయిల్యూర్తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని సర్వేలో తేలింది.
మహిళల్లో గుండెపోటు సమయంలో ఛాతీకి బదులుగా భుజం నొప్పి వస్తుందట. మహిళల్లో గుండెపోటుకు ముందు విపరీతంగా చెమటలు పట్టొచ్చు. ఇంకా అలసట, తలనొప్పి లేదా వికారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.