పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే గుండె పోటుతో పోలింగ్ బూత్ దగ్గర అకస్మాత్తుగా మరణించారు. వెంటనే షిండేను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Shindey

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే అకస్మాత్తుగా పోలింగ్ బూత్ దగ్గర మరణించారు. ఛాతీలో నొప్పి వచ్చి గుండె పోటు రావడంతో ఒక్కసారి కుప్పకూలారు. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అప్పటికే షండే మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

ఛాతీ నొప్పి వచ్చి ఒక్కసారిగా కింద పడటంతో..

మృతదేహాన్ని పోస్టు మార్టం చేయగా.. గుండె పోటుతో మరణించినట్లు తెలిసింది. ఛాతీలో నొప్పి వచ్చి, తల తిరగడంతో ఒక్కసారిగా కింద పడి మృతి చెందారు. పోలింగ్ బూత్ దగ్గరే షిండే మరణించడంతో ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 52 ప్రకారం సంబంధిత సీటుపై ఓటింగ్‌ను వాయిదా వేయవచ్చు. 

ఇది కూడా చూడండి: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ తాజాగా ముగిసింది. ఈ క్రమంలో పలు సర్వేల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. ఈ సర్వేల్లో మహారాష్ట్రలో మహాయుతిదే పైచేయి ఉన్నట్లు చెబుతున్నాయి. ఈ పోలింగ్ రిజల్ట్స్ ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. 

ఇది కూడా చూడండి:  తెలంగాణలో Dog యజమానులకు షాక్.. భారీ జరిమానా కట్టాల్సిందే..!

పీపుల్స్ పోల్ అందరి కంటే ముందుగానే తమ అంచనాలను రిలీజ్ చేసింది. ఈ పోల్స్ ప్రకారం మహాయుతికి 182 సీట్లు వస్తాయని..ఇండియా కూటమి 97, ఇతరులకు 9 స్థానాలు దక్కుతాయని తెలిపింది. చూస్త ఈ సారి ఎన్డీయే కూటమి హవా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు