Veronika: ప్రపంచంలో తొలిసారి.. తన పని తానే చేసుకునే ఆవు

మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు.

New Update
Veronika

మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు. వెరోనికా(Veronika) అనే ఆవు చేసిన పని శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చరిత్రలోనే ఫస్ట్‌ టైం పరికరాలను ఉపయోగించిన ఆవుగా వెరోనికా(Cow Use Tools) రికార్డు సృష్టించింది. ప్రస్తుతం వెరోనికాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read :  నోటి బ్యాక్టీరియాతో లివర్ ఫసక్.. షాకింగ్ రిపోర్ట్!

వార్తలోకి ఎక్కిన వెరోనికా

సాధారణంగా ఆవులు తమ అవసరాల కోసం ప్రకృతిపై ఆధారపడతాయి తప్ప, సొంతంగా పరికరాలను తయారు చేసుకోవడం లేదా వాడటం మనం చూడము. అయితే, జర్మనీలోని ఒక పరిశోధనా కేంద్రంలో ఉన్న వెరోనికా అనే ఆవు, తన శరీరంపై దురదగా ఉన్నప్పుడు ఒక పొడవాటి చెక్క ముక్కను నోటితో పట్టుకుని, దానిని బ్రష్‌లా వాడుతూ తన వీపును గోక్కుంది. ఇది చూసిన యానిమల్ బిహేవియర్ అబసర్‌యేషన్ సైంటిస్టులు విస్తుపోయారు. జంతువులు తమ అవయవాలు అందని చోట వేరే వస్తువును వాడటం అనేది అత్యున్నత స్థాయి మేధస్సుకు నిదర్శనం.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

గతంలో కాకులు, ఏనుగులు, కోతులు మాత్రమే పరికరాలను వాడతాయని మనం చదువుకున్నాం. కానీ వెరోనికా ప్రవర్తనతో 'బోవిన్' (ఆవు జాతి) మేధస్సుపై కొత్త చర్చ మొదలైంది. వెరోనికాకు తన వీపుపై దురద వచ్చినప్పుడు, అక్కడ కాలు అందకపోవడంతో పక్కనే ఉన్న పుల్లను ఒక సాధనంగా మార్చుకుంది. ఇది ఆవులలో ఉండే 'కాగ్నిటివ్' (అభిజ్ఞా) సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ ఆవు కేవలం ఒకసారి మాత్రమే కాకుండా, పలుమార్లు ఇదే విధంగా చేయడం వల్ల ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఆమె ఆలోచించి చేసిన పని అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Also Read :  పాము గుడ్లు తినొచ్చా..? ఈ విషయం తెలిస్తే అవునా.. నిజమా.. అని అవాక్కవుతారు..!

నిజాలు వెలుగులోకి వచ్చిన నిజాలు

ఆవులకు అత్యంత సన్నిహిత మిత్రులు ఉంటారని, వారు విడిపోతే ఆవులు ఒత్తిడికి లోనవుతాయని తేలింది.
జ్ఞాపకశక్తి: ఇవి మనుషుల ముఖాలను, తమకు జరిగిన అన్యాయాలను లేదా ఉపకారాలను సంవత్సరాల తరబడి గుర్తుంచుకోగలవు.
భావోద్వేగాలు: క్లిష్టమైన సమస్యలను పరిష్కరించినప్పుడు ఆవులు కూడా ఆనందంతో గెంతుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

Advertisment
తాజా కథనాలు