నీలోఫర్ కేఫ్ క్లోజ్.. | Niloufer Cafe Closed | Telangana Bhavan Locked | KTR ACB Enquiry | RTV
తెలంగాణలో ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నారు.
ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నోటీసులు జారీ చేశారని మండిపడింది.
ఫార్ములా ఈ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కి సవాల్ విసురుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ , హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ, ఏసీబీ విచారించాయి. గతంలోనే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్టోను విచారించిన ఏసీబీ ఈ రోజు మరోసారి విచారించనుంది.
కేటీఆర్‌పై ఏసీబీ విచారణ ముగిసింది. తనను అధికారుల 82 ప్రశ్నలు అడిగారని కేటీఆర్ చెప్పారు. అవగాహన మేరకు వాళ్లకి సమాధానాలిచ్చినట్లు తెలిపారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచిన హాజరవుతానని చెప్పానన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.