/rtv/media/media_files/2025/05/26/9U2APE51GbPmQsyeMG0v.jpg)
KTR
BIG BREAKING: ఫార్ములా ఈ కార్ రేస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ లేఖపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ... తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అందుకే కేటీఆర్‌కు గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటూ ట్వీట్‌చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్.. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ బాంబు దాడి !
Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది.ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది.అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. 2025 మే 28న ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరణకు హాజరుకావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. అయితే తాను యూకే, అమెరికా పర్యటన తర్వాత హాజరవుతానని కేటీఆర్ ఏసీబీకి సమాధానం ఇచ్చారు. కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఏజెన్సీకి తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కాగా ఈ కేసులో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడం ఇది రెండో సారి కావడం విశేషం.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…
Follow Us