Formula E Rase : ఈ ఫార్ములా కేసు..ఎఫ్ఈఓ కంపనీ సీఈఓను మరోసారి విచారించనున్న ఏసీబీ

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ , హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ, ఏసీబీ విచారించాయి. గతంలోనే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్టోను విచారించిన ఏసీబీ ఈ రోజు మరోసారి విచారించనుంది.

New Update
Formula E Rase

Formula E Rase

Formula E Rase :  ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కీలక మలుపులు తీసుకుంటుంది. ఈకేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని దర్యాప్తు సంస్థలు ఈడీ, ఏసీబీ ఇప్పటికే విచారించాయి. కాగా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. విదేశీ సంస్థ ఎఫ్ఈఓ‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు వర్చువల్‌గా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా గతంలోనే ఎఫ్ఈఓ సంస్థ సీఈఓ ఆల్బర్టోను వర్చువల్‌గా విచారించిన ఏసీబీ ఈ రోజు మరోసారి విచారించనుంది.గతంలో పలు కీలక అంశాలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఈ విచారణలో భాగంగా ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అధికారులకు కీలకంగా ప్రశ్నించారు.

Also read: SLBC: మంత్రుల చేపల కూర విందు.. కేటీఆర్ సంచలన ట్వీట్!

ఈ కేసులో విచారణ తర్వాత ఎఫ్ఈఓ‌ కంపెనీ సీఈవో ఇచ్చే స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేయన్నారు ఏసీబీ అధికారులు.ఇదిలా ఉండగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏ1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇప్పటికే రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏ2గా ఉన్న అప్పటి మునిసిపల్, పట్టణాభివృద్ధి స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి వాంగ్మూలాన్ని ఏసీబీ రికార్డ్ చేసింది ఏసీబీ.అంతే కాకుండా జనవరి 18న గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ప్రతినిధుల స్టేట్‌మెంట్లను సైతం రికార్డ్ చేసింది ఏసీబీ. మరి ఎఫ్ఈఓ‌ కంపెనీ సీఈవో విచారణ తర్వాత ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

Also read: కరీంనగర్‌లో పోలింగ్ సిబ్బంది బస్సుకు ప్రమాదం.. 20 మందికి గాయాలు

 గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో యూకేకు చెందిన ఫార్ములా ఈ-ఆపరేషన్స్‌ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్‌ శాఖ తరఫున హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ రిటైర్డ్ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చూడండి: TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నిరుద్యోగ యువతకు చైర్మెన్ అదిరిపోయే శుభవార్త! 

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు