Telangana : రేపు కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అందుకే రేపు నల్లగొండలో కేసీఆర్ సభ జరుగుతండగా కాళేశ్వరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. By Manogna alamuru 12 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Reddy Vs KCR : 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాత్రికేయులతో ఛలో కాళేశ్వరం(Chalo Kaleshwaram) అంటూ బయలుదేరుతున్నారు తెలంగాణ(Telangana) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Ex. CM KCR). వారందరితో పాటూ కుంగిన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage), కన్నెపల్లి పంప్ హౌస్‌ల పరిశీలన చేయనున్నారు. అక్కడే కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. లక్ష కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం నాణ్యతపై వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక రేవంత్ రెడ్డితో పాటూ కాళేశ్వరానికి ప్రభుత్వంలోని హేమా హేమాలీ, అధికారులు వెళ్ళనున్నారు. దీంతో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మేడిగడ్డ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. Also Read : Andhra Pradesh : నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం కీలక చర్చలు. కేసీఆర్ సభకూడా రేపే... మరోవైపు రేపే నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా జరగనుంది. ఒకవైపు కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇంకోవైపు నల్లగొండలో కేసీఆర్ సభ... ఒకే రోజు రాష్ట్రంలో పోటాపోటీగా రెండు కార్యక్రమాలు జరగనున్నాయి. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబి(KRMB) కి అప్పగించటాన్ని నిరసిస్తూ కేసీఆర్ ఈ బారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ దగ్గర నార్కట్ పల్లి-అదందకి హైవే దగ్గరల్లో ఉన్న పెద్ద స్థలంలో ఈ సభ జరగనుంది. దీనికి భారీ సంఖ్యలో రైతులు, ప్రజలను సమీకరించనున్నారని తెలుస్తోంది. నల్లగొండ కేసీఆర్ సభ ఏర్పాట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. ఆయన ఈ సభ గురించి మాట్లాడుతూ ఇవాళ దొంగల చేతికి తెలంగాణ పోయింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తామంటూ మాట్లాడుతున్నారు. ఇది చాలా నీచ సంస్కృతి అంటూ మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను తిరిగి రాష్ట్ర పరిధిలోకి తీసుకురాకుంటే కాంగ్రెస్ వాళ్ళను గ్రామాల్లో తిరగనివ్వం అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. Also Read : Balka Suman: బాల్క సుమన్ అరెస్ట్ తప్పదా? #krmb-project #ex-cm-kcr #cm-revanth-reddy #chalo-kaleshwaram #medigadda-barrage మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి