MP Raghunandan Rao : ముఖ్యమంత్రికి బూతులు తప్ప సబ్జెక్ట్ లేదు..ఎంపీ రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఆరోపించారు. అసలు ఆ భాష ఏంటి? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆయన అన్నారు.

New Update
Raghunandan Rao

MP Raghunandan Rao

MP Raghunandan Rao : రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సబ్జెక్ట్ లేక బూతులు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఆరోపించారు. అసలు ఆ భాష ఏంటి? మీ ఇద్దరి భాషతో రాజకీయ నాయకుల మీద ప్రజలకు గౌరవం పోతుందని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోవడం లేదు. దేశంలో ఎన్నికలు జరిగితే ఒక్కొక్క రాష్ట్రాన్ని కాంగ్రెస్ కోల్పోతుందని తెలిపారు. నిర్మాణాత్మక ఆలోచనతో ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేస్తు్న్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటి రెండు పథకాలకు మాత్రమే గాంధీ పేరు పెట్టారని అదే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ల పేర్లు ఎన్ని పథకాలకు పెట్టారు ? బహిర్గతం చేస్తారా? అంటూ ఆయన నిలదీశారు.

బీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడుతూ కొడుకు,అల్లుడితో చేతగాక ఎక్కడ ఎన్నికలు జరిగిన బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోతుందని కేసీఆర్ బయటికి వచ్చారన్నారు.చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి వచ్చారు కాబట్టే ఏదో మాట్లాడాలని మాట్లాడారన్నారు. బీఆర్ ఎస్ ముగిసిన అధ్యయనం అన్న ఆయన కేసీఆర్ పై ప్రజలకు విశ్వాసం లేదని తేల్చి చెప్పారు. సొంత బిడ్డనే పార్టీ నుంచి బయటికి వచ్చి తండ్రి చేసిన తప్పులు చెప్తుందని దాని మీద ముందు బీఆర్ ఎస్ నేతలు సమాధానం చెప్పాలని కోరారు.మాకు గ్రూప్ లు లేవన్న రఘునందన్‌ రావు అందరం మోడీ నాయకత్వంలో పని చేసి తెలంగాణ లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ విషయంలో నటుడు శివాజీ క్షేమాపణ చెప్పాడని అది ముగిసిన అధ్యాయం దానిపై నేను మాట్లాడనని స్పష్టం చేశారు.
  
  

Advertisment
తాజా కథనాలు