KCR Vs Kavitha: నాడు కేసీఆర్.. నేడు కవిత.. 24 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ సంచలనంగా మారింది. తన ఎమ్మెల్సీ పదవీతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యాత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కవిత.. అదే బాటలో నడుస్తున్నారు.

New Update
kcr and kavitha

KCR Vs Kavitha

KCR Vs Kavitha: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్సీ కవిత ఇష్యూ సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్సీ పదవీతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యాత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రేపు మాపో కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని ప్రచారం సాగుతోంది. కాగా అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కవిత.. మక్కికి మక్కి దించేశారు.  ఆనాడు కేసీఆర్ టీడీపీ సభ్యత్వానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఈరోజు కవిత ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.అనంతరం కేసీఆర్ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

రేపు మాపో కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. మాకు పదవులు ముఖ్యం కాదు.. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు కవిత అదే బాటలో నడుస్తున్నారు.ఆనాడు కేసీఆర్ పార్టీ ఏర్పాటు చేసి ఉద్యమంలోకి వెళ్లారు.  ఇప్పుడు కవిత కూడా అదే మాట చెబుతున్నారు. ఉద్యమం నుంచి వచ్చిన మళ్ళీ ఉద్యమంలోకి వెళ్తానని కవిత స్పష్టం చేశారు.కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ పెట్టిన తర్వాత కూడా సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో కూడా కవిత నిలబడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఉప ఎన్నికల కేసీఆర్ కు కలిసి వచ్చాయి. అదే సెంటిమెంట్ కవిత అప్లై చేయాలనుకుంటున్నారని సమాచారం.

Also Read :   బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!

స్వరాష్ట్ర సాధన కోసం మహత్తర పోరాటానికి అంకురార్పణ చేసిన కేసీఆర్‌ 2001 ఏప్రిల్ 27నాడే ఆయన రాజీనామాల పర్వం ప్రారంభమైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యేకు, టీడీపీ సభ్యత్వానికి ఏకకాలంలో మూడు రాజీనామాలను వేదికపైనుంచే ప్రకటించారు. ఆ తర్వాత సిద్దిపేట నుంచి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడుస్తారని ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి:ఇన్‌స్టా ప్రియుడికోసం.. కట్టుకున్నోన్ని వదిలేస్తానన్న భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే?

Advertisment
తాజా కథనాలు