Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. జరిగిన నష్టాన్ని కూడా వారి నుంచే రాబట్టాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతోందని ఈటల రాజేందర్ అన్నారు. ఇసుకమీదే ఆ ప్రాజెక్టు కట్టారని.. అప్పట్లో కన్నెపల్లి పంప్‌హౌస్ మొత్తం కూలిపోయిందంటూ విమర్శించారు. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేసి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు