/rtv/media/media_files/2025/02/12/A9fuEXTfXdgL6WKI5RQY.webp)
Etala Rajender:
Eatala Vs Revanth: గత బీఆర్ఎస్ పాలనలో దేవాదాయ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయని, ఆ పార్టీ నేతలు ఇష్టరీతిన భూములు కబ్జా చేశారని రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ భూ కబ్జాలపై తొందరలోనే విచారణ ప్రారంభిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీజేపీలో చేరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.మరోవైపు.. రాష్ట్రంలో కులగణన నిర్వహించి.. బీసీ రిజర్వేషన్ల సర్వేతో కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోందని మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణన విలువ ఇప్పుడే అర్థం కాదని చెప్పారు. ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు తీవ్ర న్యాయం జరుగుతుందని కొండా సురేఖ ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఈటల రాజేందర్ కు త్వరలోనే నోటీసులు ఇస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు.
Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?
కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందని.. రీ సర్వే చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయగా.. ఆ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్పందించారు. సర్వే మళ్లీ నిర్వహించాలంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని కొండా సురేఖ స్పష్టం చేశారు. రీ సర్వే అని కేటీఆర్ అంటున్నారని.. అయితే ఆయన తన చెల్లి కల్వకుంట్ల కవితను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ కులగణన సర్వేలో గానీ, ప్రొఫార్మాలో గానీ ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ను కొండా సురేఖ డిమాండ్ చేశారు.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖా మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పై భూ ఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో వారు ప్రభుత్వం 1994లో తమకు సర్వ్ నెంబర్ 130/5, 130/9, 130/10 లలో ఒక్కో కుటుంబానికి 1 ఎకరం 20 గుంటల చొప్పున, అలాగే సర్వే నెంబర్ 64/6 లో మూడు ఎకరాలు ఒకరికి కేటాయించినట్టు తెలిపారు. కొన్ని రోజులుగా ఈటెల రాజేందర్ తమను బెదిరిస్తున్నారని చెప్పారు. ఆ అసైన్డ్ భూములను త్వరలో ప్రభుత్వం తిరిగి స్వాధీన పరుచుకుంటుందని చెప్పి బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. ఇప్పటికే అక్కడ దాదాపు 100 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటెల రాజేందర్ ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారని.. అక్కడ వారు ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ పెట్టేందుకు ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారంటూ ఆ లేఖలో ఆరోపించారు. ఈ నేపధ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణలపై అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందించారు. అప్పట్లో మంత్రి తనను అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారని చెప్పి సంచలనం సృష్టించారు. అచ్చంపేట వద్ద మంత్రికి కోళ్ల ఫారంలు ఉన్నాయనీ, వాటి కోసమే భూమిని రెగ్యులరైజ్ చేయాలని కోరారనీ ధర్మారెడ్డి చెబుతున్నారు. అయితే, కలెక్టర్ స్థాయిలో అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం అయ్యే పని కాదని తాను చెప్పానని ఆయన తెలిపారు.
Also Read: Trump-musk:మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
ఇక మరో అధికారి అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ అక్కడ 25 ఎకరాల భూమినివ్వాలని తనను రాజేందర్ సంప్రదించారని చెబుతున్నారు. తాను వెళ్లి ఆభూములను పరిశీలించానని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు అసైన్డ్ లాండ్ ఇవ్వడం కుదరదని తాను చెప్పానన్నారు. అలాగే ప్రస్తుతం ఈ భూమి ఈటెల ఆధీనంలోనే ఉందని ఆయన వివరించారు.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
కాగా ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుదేల్చాల్సిందిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాధమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఈటల మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరి మల్కాజిగిరి నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. కాగా బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఈటలకు అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సమయంలో తిరిగి విచారణ చేపట్టనున్నట్లు మంత్ర ప్రకటించారు. మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతలను కూడా ఈటల అడ్డుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈటలను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం