Hospitals: వైద్య సిబ్బందిపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో వైద్య సిబ్బందిపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం.. ఆస్పత్రుల యాజమాన్యాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి జరిగితే ఆరు గంటల్లోపు FIR నమోదు చేయాలని సూచించింది. లేకపోతే ఆ సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.