/rtv/media/media_files/2024/11/01/KcCqWhsASE3FBWpIPAuB.jpg)
ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించేస్తుంది అంటే ఏంటో అనుకున్నారు. కానీ ఇప్పుడు అది నిజమని ప్రూవ్ అవుతోంది. తాజాగా చాట్ జీపీటీ చేసిన ఓ పని అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. డాక్టర్లకు అంతుపట్టని సమస్యను ఇట్టే పసిగట్టింది చాట్ జీపీటీ. అమెరికాలో అలెక్స్ అనే పిల్లాడికి ఓ వింత సమస్య వచ్చింది. బాబు పళ్ళు సరిగ్గా పెరగకపోవడం, ఉన్నట్టుండి శరీరం తూలటం వంటి లక్షణాలతో బాధపడతున్నాడు. అలెక్స్ ను అతని పేరెంట్స్ చాలా ఆసుపత్రులు తిప్పారు. పదిహేడు మంది డాక్టర్లు అతనికి అన్ని పరీక్షలూ చేశారు. కానీ జబ్బేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఎంఆర్ఐ లాంటి పెద్ద పరీక్షలను కూడా చేయించారు. కానీ ఎవరికీ ఏమీ తెలియలేదు.
రిపోర్టులు చూసి చెప్పేసింది..
డాక్టర్లు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన అలెక్స్ తల్లిదండ్రులకు చాట్ జీపీటీ గుర్తుకు చవ్చింది. అంతే దానికి ఎంఆర్ఐ రిపోర్టులు, లక్షణాలు అన్నీ వివరంగా చెప్పారు. ఒక్కొక్కటీ ఓపికగా వివరించారు. అన్నీ చెప్పగానే కొద్ది నిమిషాల్లో చాట్ జీపీటీ పిల్లాడికి ఉన్న జబ్బును గుర్తుపట్టింది. దాన్ని ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్’ సమస్యని నిర్ధరించింది. ఇదో అరుదైన నాడీ సమస్యని తేల్చి చెప్పింది. ఈ జబ్బు వెన్నెముకను ఎఫెక్ట్ చేస్తుంది. ఎదుగుదల, కదలికలు వంటి వాటిని ప్రభావితం చేసి దెబ్బతీస్తుంది. ఇవన్నీ చాట్ జీపీటీ తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. అంతేకాదు ఈ జబ్బు పేరుతో ఒక ఫేస్ బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేయమని చెప్పింది. ఇలాంటి పిల్లలున్న పేరెంట్స్ ను కలవమని కూడా సలహా ఇచ్చింది.
చాట్ జీపీటీ సలహాతో అలెక్స్ తల్లిదండ్రులు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అక్కడ అందిన సలహాలు, సూచనలతో ముందుకు వెళ్ళారు. న్యూరో సర్జన్ ను కలిశారు. చాట్ జీపీటీ చెప్పిన వివరాలు అన్నీ ఆయనకు కూడా తెలిపారు. అనంతరం డాక్టర్ సలహా మేరకు అలెక్స్ కు ఆపరేషన్ కూడా చేయించారు. ప్రస్తుతం పిల్లాడు కోలుకుంటున్నాడు. ఇవన్నీ అయిన తర్వాత అలెక్స్ తల్లి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. కొంతమంది ఏఐ గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే..మరి కొంత మంది అన్ని సార్లు అలా జరగదని అంటున్నారు. చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఎప్పటికీ డాక్టర్లు ప్రత్యామ్నాయం కాలేవని హెచ్చరిస్తున్నారు.
today-latest-news-in-telugu | chat-gpt | doctors | kid
Also Read: USA: మీ అంతట మీరే వెళ్ళిపోండి..మేము ఖర్చులు భరిస్తాం..ట్రంప్ ఆఫర్