Delhi AIIMS News: ఢిల్లీలోని ఎయిమ్స్‌‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు

ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు 4 కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగంలో అదనంగా మరో 2 కాళ్లు వేలాడుతున్నాయి. దీన్ని అసంపూర్ణ కవలలుగా పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం బాలుడికి ఆపరేషన్ చేేసి అదనంగా ఉన్న కాళ్లు తొలగించారు.

New Update
delhi aims

delhi aims Photograph: (delhi aims)

Delhi AIIMS News: పుట్టకతోనే నాలుగు కాళ్లతో బాధపడుతున్న బాలుడికి ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు 4 కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగంలో అదనంగా మరో 2 కాళ్లు వేలాడుతున్నాయి. దీంతో చిన్నప్పటి నుంచి అవహేళనకు గురైయాడు. స్కూల్‌లో చదువుకుంటుండగా తోటి విద్యార్థులు హేళన చేస్తు్న్నారని అతడు 8వ తరగతి నుంచి స్కూల్‌ మానేశాడు. శారీరక ఎదుగుదల లేకపోవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయాడు. చాలా ఏళ్లుగా మానసిక వేదన అనుభవించాడు. ఆ యువకుడికి ఎయిమ్స్ వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. పొట్ట వద్ద ఉన్న అదనపు కాళ్లను అరుదైన సర్జరీ ద్వారా తొలగించారు. 

Also Read: SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్‌ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

Also Read: MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం

గత నెలలో బాలుడిని ఢిల్లీ ఎయిమ్స్‌ అవుట్ పేషెంట్ విభాగానికి తీసుకువచ్చారు. అతడి కడుపు నుంచి వేలాడుతున్న అదనపు కాళ్లను డాక్టర్లు పరిశీలించారు. ఆపరేషన్ చేసి అదనపు కాళ్లను తొలగించారు డాక్టర్లు. ఇలాంటి సర్జరీ నిర్వహించడం ఎయిమ్స్‌లో తొలిసారి అని డాక్టర్‌ కృష్ణ తెలిపారు.

Also Read : వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

కోటి మందిలో ఒకరికి ఇలా..

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు కాళ్లు ఉన్న వ్యక్తుల కేసులు 42 మాత్రమే నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అదనపు కాళ్ళు వల్ల ఆ బాలుడి శరీరం సరిగ్గా ఎదగట్లేదని తెలిపారు. దీనివల్ల ఇతర అవయవాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అసంపూర్ణ కవలలుగా పిలిచే ఇలాంటి కేసు కోటి మందిలో ఒకరికి ఉంటుందని డాక్టర్‌ కృష్ణ తెలిపారు.

Also Read: Chhaava: ఛత్రపతి మహారాజ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్.. 'ఛావా' ఇప్పుడు తెలుగు వెర్షన్ లో కూడా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు