Heat: వామ్మో ఏం ఎండలు..రోళ్లు పగలడం కాదు..ఏకంగా వాషింగ్ మెషినే పేలిపోయింది!
ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్‌కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు.