Delhi: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం ! ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. By B Aravind 19 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు వల్ల అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలోనే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు. Also Read: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..? Artificial Rain '' ఉత్తర భారత్‌ను పొగమంచు కప్పేస్తోంది. దీని నుంచి విముక్తి పొందాలంటే కృత్రిమ వర్షమే ఏకైక మార్గం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం నైతిక బాధ్యత. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కృత్రిమ వర్షంపై కేంద్ర ప్రభుత్వానికి గత మూడు నెలలుగా లెటర్లు రాస్తున్నాను. కానీ వాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. కృత్రిమ వర్షంపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని'' గోపాల్ రాయ్ అన్నారు. Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం! ఇదిలాఉండగా మంగళవారం కూడా ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 494కి పడిపోయింది. అలాగే చాలాప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్‌ను కూడా దాటిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరుసగా రెండోరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పొగమంచు వల్ల రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణాల కోసం అదనపు సమయం కేటాయించుకోవాలంటూ విమానసంస్థలు కూడా సూచనలు చేస్తున్నాయి. Also Read: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్.. Also Read: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి.. #national-news #delhi #artificial-rain #telugu-news #air-pollution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి