Air Pollution: పొగమంచు ఎఫెక్ట్.. ఢిల్లీలో పనివేళల్లో మార్పులు ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. అలాగే ఆరవ తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. By Kusuma 16 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతుంది. వరుసగా మూడో రోజు ఏక్యూఐ తీవ్రస్థాయిలో ఉంది. ఈ రోజు వాయు నాణ్యత సూచీ 428గా నమోదైంది. వాయు కాలుష్యం పెరగడంతో ఢిల్లీలో ప్రాథమిక స్కూళ్లకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కాలుష్యం నేపథ్యంలో ఆరు నుంచి మిగతా తరగతులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది కూడా చూడండి: అయ్యప్ప దర్శనాలకు పోటెత్తిన భక్తులు..తొలిరోజే ఎంతమందంటే? ట్రాఫ్రిక్‌ను దృష్టిలో పెట్టుకుని.. పొగమంచుకి దారి కూడా సరిగ్గా కనబడక ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు. ఇది కూడా చూడండి: మెడికల్ కాలేజ్‌లో అగ్ని ప్రమాదం..10 మంది చిన్నారులు సజీవదహనం ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు, మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా చూడండి: చివరి మ్యాచ్‌లో గెలుపు..3–1తో సీరీస్ కైవసం ఢిల్లీలో ఉండే కాలుష్యానికి అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. గాలి నాణ్యతను పెంచడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీలో చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఇది కూడా చూడండి: రీల్స్ చేస్తే జైలుకే..రైల్వే బోర్డు సీరియస్ డెసిషన్ #delhi #air-pollution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి