Space X: ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనే..స్పేస్ ఎక్స్ కొత్త ప్రయోగం

ఢిల్లీ నుంచి అమెరికాకు అరగంటలోనో, గంటలోనో వెళిపోతే ఎంత బావుంటుందో కదా. దేశాల మధ్య ఉన్న దూరం రోజుల నుంచి గంటల్లోకి మారిపోతుంది అంటున్నారు స్పేస్ ఎక్స్ బాస్ ఎలాన్ మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో తాము ఎర్త్ టు ఎర్త్ రాకెట్‌ను నడుపుతామని చెబుతున్నారు.

author-image
By Manogna alamuru
New Update
musk

Earth To earth Star Ship Rocket: 

జనవరి తర్వాత అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. దీని తర్వాత టెస్లా, ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ చాల ఇంపార్టెంట్ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రభుత్వ సమర్థత విభాగం (DOGE) బాధ్యతలు మస్క్ , వివేక్ రామస్వామితో కలిసి నిర్వర్తించనున్నారు. దీని ద్వారా తన స్పేస్ ఎక్స్ ను ఎక్స్‌ప్యాండ్ చేయనున్నారు ఎలాన్ మస్క్. ఇందులో ముఖ్యంగా స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఒక ప్రాజెక్టను కూడా తీసుకురాబోతున్నారు.  

Also Read :  తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఎల్లుండి నుంచే అకౌంట్లలో డబ్బులు!

ఇది విజయవంతమైతే ప్రపంచంలోని ఏ ప్రధాన నగరానికైనా గంటలోపే చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి కేవలం అరగంటలో అమెరికా చేరుకోవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ సహాయంతో ప్రయాణీకులు క్షణాల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోగలుగుతారు.  అయితే ఇదొక స్పేస్ షిప్. మామూలు ఫ్లైట్‌లా ఉండదు. దీనిలో ప్రయాణించాలంటే ఖర్చు కూడా ఎక్కువే ఉండొచ్చు కూడా. ఈ వ్యోమనౌక దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. అధిక వేగంతో నడుస్తుంది. అంతేకాదు ఎలాన్ మస్క్ కూడా తాను తీసుకోబోతున్న బాధ్యతలను నెరవేర్చడానికి ఈ స్టార్ షిప్ రాకెట్‌ ద్వారానే వివే రామస్వామిఓ కలిసి ప్రయాణాలు చేస్తారని తెలుస్తోంది. దీని వలన టైమ్ ఆదా అవుతుందని పనులు మరింత వేగంగా జరుగుతాయని మస్క్ టీమ్ చెబుతోంది. 

Also Read :  టాటూ వేయించుకున్న 68 మంది మహిళలకు ఎయిడ్స్!

Also Read :  భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఐసీసీలో చక్రం తిప్పుతున్న జైషా!

డైలీ మెయిల్ చెప్పిన దాని ప్రకారం..స్పేస్ ఎక్స్ దాదాపు ఒక పదేళ్ళ క్రితం ఈ స్టార్ షిప్ ప్రణాళికను రూపొందించింది. ఇందులో దాదాపుగా వెయ్యి మంది దాకా ఒకేసారి ప్రయాణించ వచ్చును. ఇది కనుక లైవ్‌లోకి వస్తే..
భూమిపై నడిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ అవుతుంది. ఇది అంతరిక్షం ద్వారా భూమిపై ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతుంది. అలెక్స్ అనే వినియోగదారు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎక్స్‌లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎలా పని చేస్తుందో వీడియోలో చూయించారు. ముందుగా రాకెట్ టేకాఫ్ అయిన తర్వాత అంతరిక్షం ద్వారా భూమికి చేరుకుంటుంది. భూమిపై ఏ ప్రదేశానికైనా గంటలోపే చేరుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వంలో ఎఫ్‌ఏఏ కింద.. స్పేస్ ఎక్స్‌ కొన్ని సంవత్సరాలలో స్టార్‌షిప్ ఎర్త్-టు-ఎర్త్‌ను కూడా ఆమోదించగలదని అలెక్స్ పోస్ట్ లో తెలిపారు. 

Also Read: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో హాకా డాన్స్ చేసిన యంగ్ ఎంపీ..కొత్తగా అపోజ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు