PM Modi: ప్రధాని మోదీకి తప్పిన పెను ప్రమాదం.. ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. By B Aravind 15 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Modi Aircraft Hit By Technical Snag ప్రధాని మోదీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవగఢ్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయన విమానం నిలిచిపోయింది. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని ఢిల్లీ ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల ప్రచారం కోసం.. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం ఝార్ఖండ్‌లో పర్యటించారు. రెండు ప్రాంతాల్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. Also Read: మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు ర్యాలీ ముగించుకొని ఢిల్లీ తిరిగివెళ్లేందుకు దేవ్‌గఢ్ విమానశ్రయానికి చేరుకున్నారు. కానీ ప్రధాని ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం టేకాఫ్ అవ్వలేదు. ప్రస్తుతం అందులోని సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఢిల్లీ నుంచి మరో విమానాన్ని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీకి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో బీజేపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇదే రోజున ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ కూడా గంటకు పైగా నిలిచిపోయింది. Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పర్మిషన్ రాకపోవడంతో ఆయన హెలికాప్టర్ గొడ్డాలో ఆగిపోయింది. దీంతో రాహుల్ గాంధీ షెడ్యూల్‌కు కూడా ఆటంకం ఏర్పడింది. దీనికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇదిలాఉండగా.. ఝార్ఖండ్‌లో నవంబర్ 13న తొలి దశ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 20న మహారాష్ట్రతో పాటు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. Also Read : Snakes: ఆ దీవిలో అడుగడుగునా మనిషిని మింగేసే పాములు.. కళ్లు మూశారో ఖతం! Also Read: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే #airplane #delhi #jharkhand #telugu-news #pm-modi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి