Delhi: బీభత్సంగా కమ్మేసిన పొగమంచు.. డేంజర్ జోన్లో ఢిల్లీ
ఢిల్లీలో పొగమంచు బీభత్సం సృష్టిస్తోంది. వాయునాణ్యత సూచీ 428గా నమోదు కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. పొగమంచు కారణంగా 300 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.