ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. 20 రాష్ట్రాల CMలు, 50 మంది సెలబ్రెటీలు

ఢిల్లీలో విజయం సాధించిన బీజేపీ ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 20న CM ప్రమాణస్వీకారం జరగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి 50 మంది సినీ సెలబ్రెటిీలు, 20 రాష్ట్రాల CMలు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు.

New Update
delhi Cm swearing

delhi Cm swearing Photograph: (delhi Cm swearing)

బీజేపీ 26ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకుంది. భారీ మెజార్టీతో రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికలు జరిగి 10 రోజులు కావస్తున్నా.. సీఎం అభ్యర్థి ఇంకా ఖరాలు కాలేదు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, రేఖా గుప్తా పేర్లు ఢిల్లీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫిబ్రవరి 20న(గురువారం) సాయంత్రం కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి. రామ్‌లీలా మైదాన్‌లో సినీ సెలబ్రెటీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకార మహాత్సవానికి హాజరుకానున్నారు. 50 మంది సినీ సెలబ్రెటీలతోపాటు ప్రముఖ వ్యాపారవేత్తలు, విదేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు