Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం

ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్‌లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

New Update
bjp rekha gupta

bjp rekha gupta Photograph: (bjp rekha gupta )

ఢిల్నీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సీఎం అభ్యర్థిని నిర్ణయించింది. ఢిల్లీ  ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఉపముఖ్యమంత్రి బాధ్యతలు పర్వేశ్ శర్మకి కట్టబెట్టారు. ఢిల్లీ రామ్ లీలా మైదాన్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవికి పర్వేశ్ శర్మ, రేఖా గుప్తాల మధ్య పోటీ నడిచింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీకంగా రేఖా గుప్తా పేరును ముఖ్యమంత్రిగా బలపరిచారు. దీంతో ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా స్థానం సంపాధించారు.   

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా విజయేంద్ర గుప్తాను నియమిస్తూ నిర్ణయించుకున్నారు బీజేపీ పెద్దలు. ముఖ్యమంత్రితోపాటు మరో ఆరుగురు రేపు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి లెఫ్ట్‌నెంట్ గరవ్నర్‌ను కోరునున్నారు.

Also Read : కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్

రేఖా గుప్తా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి అప్ అభ్యర్థిపై 29వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా నిలిచారు. ఈమె 1997లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలి కూడా ఎన్నికైయ్యారు. రేఖా గుప్తా 2007, 2012లో ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు.

2025 ఫిబ్రవరి 5న 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడించారు. అందులో 48 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలతో సరిపెట్టుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు