Modi: ఢిల్లీకి ఖతార్ అధినేత.. ఎదురెళ్లి స్వాగతం పలికిన మోడీ!

ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అధినేత కు స్వాగతం పలికారు. ఈ విషయం గురించి స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

New Update
modi quatar

modi quatar

ఖతార్‌ అధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం భారత్‌కు సోమవారం చేరుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ... స్వయంగా ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఈ విషయాన్ని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు. ‘‘నా సోదరుడు, ఖతార్ ఎమిర్ హెచ్ హెచ్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్-థానీకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లాను. ఆయన భారత్ పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా.. రేపు మేము ఇరువురం భేటీ కాబోతున్నాం’’ అని పేర్కొంటూ ఫొటోలను మోడీ పోస్ట్‌ చేశారు.

Also Read:  Pakistan: నీరు లేక అల్లాడుతున్నపాక్.. 700 అడుగులు తవ్విన చుక్క నీరు లేదు!

విమానాశ్రయం నుంచి వచ్చిన అనంతరం విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో తమీమ్‌ బిన్‌ హమద్‌ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఖతర్‌ ఎమిర్‌ మంగళవారం కలవనున్నారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరువురు భారత్- ఖతార్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారని విదేశాంగశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

Also Read:Bengalore: ప్లీజ్ ఉద్యోగం ఇవ్వండి చాలు.. ఉచితంగా పనిచేస్తాను.. బెంగళూరు టెకీ పోస్ట్ వైరల్

దాదాపు పదేళ్ల తర్వాత..

పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకుంటారని తెలిపింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చిన తమీమ్‌ బిన్‌ హమద్‌.. భారత్‌ కు రావడం ఇది రెండోసారి. గతంలో మార్చి 2015లో ఆయన భారత్‌కు వచ్చారు. మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని తాజా పర్యటన మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగశాఖ అభిప్రాయపడింది.

ఎమిర్ వెంట ఖతార్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధుల బృందం సైతం భారత్‌కు చేరుకుంది. ఇదిలా ఉండగా, భారత్, ఖతార్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మైత్రికి శతాబ్దాల చరిత్ర ఉంది. భారత్‌కు నమ్మకమైన భాగస్వాముల్లో ఖతార్ ఒకటి. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులు, ఎనర్జీ, టెక్నాలజీతో పాటు ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతోంది. ఖతార్‌లో నివసిస్తోన్న విదేశీయుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉండటం విశేషం.

Also Read: Ap: ఏపీలో మహిళలకు తీపికబురు.. వారందరికి ఉచితంగా కుట్టు మిషన్లు

Also Read: CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు