ఢిల్లీలో రైతుల పాదయాత్ర.. భారీగా ట్రాఫిక్ జామ్
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతులు ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంటును ముట్టడించేందుకు వేలాది మంది రైతులు అక్కడికి పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు మోహరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది.