/rtv/media/media_files/2025/03/13/LVRiYW8VpzuPGJuWNZDz.jpg)
Delhi school scam President green signal for FIR on Sisodia, Satyendra Jain
AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలిసిందే.
ప్రభుత్వ పాఠశాలల్లో కుంభకోణం..
ఈ మేరకు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్(CVC) 2020 ఫిబ్రవరి 17న నివేదిక విడుదల చేసింది. దీంతో 2022లో ఢిల్లీ గవర్నమెంట్ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తుకు సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను అందించింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రులుగా ఉన్న సిసోడియా, జైన్ ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Also Read : యంగ్ సైంటిస్ట్ ప్రాణం తీసిన పార్కింగ్ పంచాయతీ.. అసలేమైందంటే?
మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో జైలుకు కూడా వెళ్లాడు. కాగా సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్నాడు. హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత రెండు కేసులలో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు నాయకులు బెయిల్‌పై బయట ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
2021-22 మద్యం పాలసీని అమలు చేయడంలో ఆయన అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా సిసోడియా మద్యం పాలసీని రూపొందించారని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచారం చేయడానికి మద్యం వ్యాపారుల నుండి రూ.100 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో సిసోడియా జైలుకు వెళ్లారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీ ప్రభుత్వంలో మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 30 మే 2022న అరెస్టు చేసింది. సత్యేంద్ర జైన్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రముఖ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖల మంత్రి. 2015-2016లో నకిలీ కంపెనీల ద్వారా సత్యేంద్ర జైన్ రూ.16.39 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. అరెస్టు తర్వాత అతన్ని తీహార్ జైలుకు పంపారు.
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..