/rtv/media/media_files/2025/03/12/SY2bBzvn9CMBomI4z54K.jpg)
b srinivas Photograph: (b srinivas)
B Srinivasa Varma: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ పార్లమెంట్‌లో లోక్‌సభ సమావేశానికి హాజరైన అనంతరం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది.
విశ్రాంతి తప్పనిసరి..
ఈ ఘటనలో శ్రీనివాస వర్మ కాలికి గాయమైంది. వైద్య బృందం వెంటనే శ్రీనివాస వర్మకు చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడంతో విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఇక ఏపీలోని నరసాపురం పార్లమెంట్ పరిధిలో గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుండగా ఢిల్లీ నుంచి భీమవరంకు బయలుదేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read : హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే
ఇదిలా ఉంటే.. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2025 మార్చి 9న ఛాతీ నొప్పితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని .. అందుకే ఆయన్ను డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ మరికొన్ని రోజులు పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్!
73 ఏళ్ల జగ్‌దీప్ ధన్‌ఖడ్ ను డాక్టర్ రాజీవ్ నారంగ్ సంరక్షణలో క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు నుంచి ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.