USA: ఉగ్రవాదులతో దోస్తీ .. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

హమాస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే ఇండియన్ స్టూడెంట్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్న సూరీ భార్య గాజాకు చెందినది. ఈ కారణంగానే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు.

New Update
Indian Student arrested america

Indian Student arrested america

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హమాస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ బదర్ ఖాన్ సూరీ అనే విద్యార్థిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. బదర్‌ ఖాన్ సూరీ జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్‌గా ఉన్నాడు. వర్జీనియాలో బదర్ ఖాన్‌ను ఫెడరల్‌ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఖాన్ స్టూడెంట్ వీసాను అమెరికా రద్దు చేసింది. అయితే తన అరెస్టును సవాల్ చేస్తూ సూరీ ఇమ్మిగ్రేషన్ కోర్టులో సవాల్ చేశాడు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదని.. భార్య పాలస్తీనా మూలాలు ఉండటంతోనే అరెస్టు చేశారని బదర్ ఖాన్ సూరీ ఆరోపించాడు. 

ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

స్టూడెంట్ వీసా మీద వెళ్లి..

బదర్ ఖాన్ సూరీ 2020లో శాంతి, సంఘర్షణ అనే అంశంపై ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌‌డీ చేశారు. ఆ తర్వాత స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి అక్కడ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరిల్ ఫెలో, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిని నెలకొల్పే అంశంపై పరిశోధనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇతని భార్య గాజాకు చెందినది. ఈమెకు అమెరికా పౌరసత్వం ఉండటంతో అక్కడే చదువుతోంది. 

ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment