/rtv/media/media_files/2025/10/29/new-project-2025-10-29-13-35-14.jpg)
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ నష్టం అంచనాలను త్వరితగతిన సిద్దం చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు పలు సూచనలు కూడా చేశారు సీఎం.
గత నాలుగైదు రోజుల నుంచి
టెలీ కాన్ఫరెన్సులో సీఎం మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టామన్నారు. సీఎం నుంచి సచివాలయం సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పనిచేశామని తెలిపారు. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం అభినందనలు తెలిపారు. మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే... బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలమన్నారు. తుఫాన్ వెలిసింది కాబట్టి... వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలన్నారు సీఎం. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, బాధితులకేమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలన్నారు.
మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలన్నారు సీఎం చంద్రబాబు. ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని వెల్లడించారు. ఈ తుఫాన్‌ను ఎవరూ నివారించలేరు... కానీ ముందు జాగ్రత్తలతో నష్టాలను నివారించగలుగతామని సీఎం చెప్పుకొచ్చారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉంటే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు. మన చర్యలతో ప్రభుత్వంపై భరోసా పెరిగిందని చెప్పుకొచ్చారు సీఎం.
Follow Us