Philippines: వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు

ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్‌ వంగ్‌ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిదాక 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

New Update
Typhoon Fung-wong

Typhoon Fung-wong

ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్‌ వంగ్‌ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిదాక 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలు, వరదల వల్ల ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. విమానాలు, నౌకల రాకపోకలను రద్దు చేశారు. స్కూల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. అయితే తుపాను బలహీనపడి.. ప్రస్తుతం ఫిలిప్పైన్స్‌ నుంచి వాయువ్య దిశగా తైవాన్ వైపు కదులుతోంది.  

Also Read: ముగింపు దిశగా అమెరికా షట్‌డౌన్‌.. 40రోజుల తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు!

మరోవైపు ఇటీవలే ఫిలిప్పైన్స్‌ను కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ తుపాను ప్రభావానికి 224 మంది ప్రాణాలు కోల్పోయారు. 109 మంది గల్లంతయ్యారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.  మరణాల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: భార్యను చంపిన భర్త...దృశ్యం సినిమా స్పూర్తితో మాస్టర్ ప్లాన్

 ఒక్క సెబూ ఐలాండ్‌లోనే 158 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. ఈ తుపానును ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్‌ జూనియర్‌ జాతీయ విపత్తుగా ప్రకటన చేశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు